అల్వాల్, (ప్రభన్యూస్): 74వ ఆర్మీ డే ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈమేరకు శనివారం దేశ రక్షణ విభాగాల ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. దేశ స్వాతంత్ర్యం అనంతరం 1949 జనవరి 15న బ్రిటన్ ఆర్మీ అధికారి జనరల్ ఫ్రాన్సిస్ రాబర్ట్ రాయ్ బుచర్ నుంచి ఇండియన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప ఆర్మీ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈనేపథ్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో వెలసిన అమరవీరుల స్థూపం వద్ద ఎంసిఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ టిఎస్ఎ నారాయణన్ పుష్పగుచ్చాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ సమగ్రతతో పాటుగా సార్వభౌమత్వంను చాటుతూ రక్షణ విభాగాలు విభిన్న కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.