నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోని కల్వర్ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. ప్రధాన రహదారి వెంట వంతెనలు నిర్మించే సందర్భంలో డైవర్షన్ రోడ్డును పకడ్బందీగా నిర్మించిన తర్వాతే వంతెన నిర్మాణం పనులను ప్రారంభించాల్సి ఉంది. ఆర్ అండ్ బి అధికారులు నిజాంబాద్ జిల్లాలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
పలుచోట్ల ప్రధాన రహదారులు గుంటలమయంగా మారి ప్రజలకు ప్రాణాపాయస్థితికి చేరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదనేది అతిశయోక్తి కాదు. కాంట్రాక్టర్ కాలయాపన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆర్మూర్, నందిపేట్ కు వాహనాల రాక పోకలు నిలిచిపోయాయి. కేవలం చిన్న చిన్న వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది ఆర్మూర్ పట్టణం 11 వార్డులో బైపాస్ రోడ్డు నిర్మాణం పక్కన బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
వర్షాలు కురుస్తుండడంతో బ్రిడ్జి పనులు జరుగుతున్న పక్కకు రోడ్డు సరిగా కాంట్రాక్టర్ వేయకపోవడంతో ఆ మార్గము గుండా వెళుతున్న లారీ బురదలో ఇరుక్కుపోయింది. దాంతో పెద్ద వాహనాలు వెల్లే పరిస్థితి ఆ రోడ్డుపై లేదు. ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు మొద్దు నిద్రను వీడటం లేదు. రహదారుల వెంట ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులు మాత్రం స్పందించకపోవడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు రహదారుల నిర్మాణానికి విడుదల చేస్తుంది. అతి నిర్మాణ పనుల వద్ద కూడా సంబంధిత శాఖ అధికారులు మచ్చు కూడా కనపడరు. కోట్లాది రూపాయలు పనులు చేపట్టడం ఎంబీలు రికార్డులు చేయడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో చూపించే శ్రద్ధ అధికారులు ప్రజలకు ఇబ్బంది అయ్యే సమస్యల పట్ల స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాంట్రాక్టర్లు పనులు చేపడితే ఎంబి రికార్డుల ప్రకారం అధికారులకు వారి సీటు ఉన్న విలువ ప్రకారం పర్సంటేజీలు మాత్రం దండుకుంటున్నారు.