మెదక్, (ప్రభన్యూస్) : సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండడంతో చాలా మంది సంతూళ్లకు పయణంం అవుతుంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. ఈవిషయంలో మెదక్ జిల్లా పరిధిలోని ప్రజలు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌పి ప్రజలకు సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి : సంక్రాంతి సంబురాలు.. పతంగులతో జర భద్రం..
దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలన్నారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలని, విలువైన వస్తువులను ఇంటిలో పెట్టరాదని, ఇతరులకు చెప్పకూడదని, బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదన్నారు. పనిమనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలని, ఆరుబయట వాహనాలకు హ్యండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ ఏదైనా ఛైన్ వేయాలన్నారు. దగ్గరలోని పోలీస్ స్టేషన్ నెంబర్ అందుబాటులో ఉంచుకోవాలని అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital