Thursday, January 9, 2025

NZB | ఆ చెత్త వాహనాలు వారికేనా…!

నిజామాబాద్ ప్రతినిధి, జనవరి 9(ఆంధ్రప్రభ) : నిజామాబాద్ నగరంలో కేవలం పువ్వుల వ్యాపారులకు మాత్రమే చెత్త సేకరణ వాహనం చెత్త సేకరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 60వ డివిజన్ లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ వాహనాలు సమయానికి వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మున్సిపల్ టాక్స్ చెల్లించే ప్రజలకేమో…. చెత్త సేకరణ వాహనం సమయానికి రాదు… కానీ పువ్వులు అమ్మే వ్యాపారులకు మాత్రం ఒక ప్రత్యేక వాహనం.. టన్నులకొద్దీ పాడైన పువ్వులను సేకరిస్తున్నారు. ఈ పూల వ్యాపారాలు ఏలాంటి పన్నులు కార్పొరేషన్ కు చెల్లిస్తు న్నారు. వీళ్లు చెల్లించే డబ్బులు అధికారుల జేబు లోకి వెళ్తున్నాయా.. బల్దియా కా? బల్దియాలో ఏం జరుగు తుంది..?

- Advertisement -

చిన్న చెత్త సేకరణ వాహనాలు ఇంటింటికి మాత్రమే..
నగరపాలక సంస్థ పరిధిలో కేవలం చిన్న వాహనాలు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయాల్సింది ఉంటుంది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఆసుపత్రులు, ఇతరత్రా వ్యాపార సముదాయాలకు పెద్ద వాహనాలు మాత్రమే చేత్త సేకరణ చేయాలి… కానీ నిబంధనలు పక్కనపెట్టి… పూల వ్యాపారులకు ప్రత్యేక చిన్న చేత్త సేకరణ వాహనం వెళ్లి చెత్త సేకరణ చేయడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని కాలనీలో మాత్రం రెండు రోజులకు ఒకసారి చేత్త సేకరణ వాహ నాలు వస్తున్నాయి. ఎలాం టి యూజర్స్ చార్జీలు చెల్లిం చని పూల వ్యాపారులకు మాత్రం ప్రత్యేక వాహనం చెత్త సేకరణ చేయడంపై విమర్శలు వ్యక్తం అవు తున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement