Friday, November 22, 2024

గ్రీన్ యాపిల్ అవార్డ్స్ ను స్వీకరించిన అర‌వింద‌కుమార్..

లండ‌న్ – తెలంగాణ‌లో ఉన్న మొజాంజాహీ మార్కెట్, స‌చివాల‌యం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్, యాద‌గిరిగుట్ట దేవాల‌యానికి ఉత్త‌మ నిర్మాణ రంగానికి ఇచ్చే గ్రీన్ యాపిల్ అంత‌ర్జాతీయ అవార్డులు వ‌చ్చాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యూటిఫుల్ బిల్లింగ్స్ క్యాట‌గిరీలో ఈ అవార్డులు ల‌భించాయి. ఈ అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం నేడు లండ‌న్ లో జ‌రిగింది..రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున‌ తెలంగాణ పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ లండ‌న్‌లో గ్రీన్ యాపిల్ అవార్డుల‌ను అందుకున్నారు.

దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడం తెలంగాణకు దక్కిన మరో ఘనత. ఇక్కడి భవనాల డిజైన్‌, ఆర్కిటెక్చర్‌ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం పడుతున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఇప్పటికే వరల్డ్‌ గ్రీన్‌సిటీ అవార్డ్‌(2022), ట్రీ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌ అవార్డ్‌(2021), లివింగ్‌, ఇన్‌క్లూజన్‌ అవార్డ్‌-స్మార్ట్‌సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌(2021) వంటి ప్రపంచస్థాయి అవార్డులను సొంతం చేసుకున్నది తెలంగాణ‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement