మహారాష్ట్రతోపాటు తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యర 29.91 టీఎంసీలు కాగా… 28.78 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుకు వస్తున్న వరదను వచ్చినట్లే అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 34890 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా… అదేస్తాయిలో దిగువకు వరదను వదులుతున్నారు. శ్రీరాంసాగర్ కూడా పూర్తిస్థాయిలో నిండడంతో 35, 984 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు.
కడెం ప్రాజెక్టుకు మళ్లి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 86051 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా… 24, 588 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండుకుండలా దర్శనమిస్తోంది. ఎల్లంపల్లికి 1, 72, 230 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా… 2, 07, 285 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా నిజాంసాగర్ 17.80 టీఎంసీలకు గాను ప్రాజెక్టులో 15.74 టీఎంసీల నీరు ఉంది. 44500 క్యూసెక్కుల వరద వస్తుండగా..64,800 క్యూసెక్కుల వరదను అధికారులు దిగువకు వదులుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.