ప్రభన్యూస్: రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉద్యోగ బదిలీలకు సుధీర్ఘ విరామం తర్వాత నిషేధం తొలగనుంది. డిసెంబర్ 10 తర్వాత బదిలీలకు మార్గదర్శకాలు విడుదలవనున్నాయి. ఈ రెండు శాఖల్లో ఉద్యోగుల బదిలీలపై ఆర్ధిక శాఖ అనుమతించినట్లు సమాచారం. సీఎస్ పరిశీలన తర్వాత బదిలీల ఫైల్ సీఎం కేసీఆర్‌కు చేరి ఆయన ఆమోదం పొందనున్నట్లు తెలిసింది. వెనువెంటనే బదలీ షెడ్యూల్‌తోపాటు, మార్గదర్శకాలూ వెలువడనున్నాయి. ఈ రెండు శాఖల్లోని ఉద్యోగుల్లో దాదాపు సగం మంది బదలీలు కోరుతున్నట్లు తెలిసింది.
అయితే ఇందులో అర్హులను గుర్తించడం, పారదర్శకంగా బదిలీ ప్రక్రియ, అవినీతి లేకుండా బదిలీలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకోనుంది. ఈ క్రమంలో మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోపు పూర్తిచేయాలని యోచిస్తోంది. నిబంధనలు, మార్గద ర్శకాల్లో భాగంగా భార్యభర్తలు(స్పౌజ్), మ్యూచువల్ బదలీలను వివాదాలు లేకుండా తొలిదశలోనే పూర్తి చేయాలని షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాతే దివ్యాంగులు, మెడికల్ గ్రౌండ్స్, ఒంటరి మహిళల బదిలీలకు ప్రాధాన్యతనిచ్చేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాలనుండి వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లేవారికి ప్రభుత్వం ప్రత్యేక వసతులు, అలవెన్సులు అం దించి ప్రోత్సహించాలని నిర్ణయించింది.
సుధీర్ఘ కాలంగా వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని నేరుగా పట్టణాలకు అనుమతించేలా కసరత్తు చేస్తున్నారు. ఆయా శాఖల్లో అర్హులైన ఉద్యోగుల జాబితా సిద్దం చేయాలని హెచ్ ఓడీలకు ఆదేశాలు జారీ చేయనున్నారు. రెండేళ్ల సర్వీస్ పూర్తయిన వారికి పదోన్నతుల అంశం పూర్తవడంతో వీరి జాబితా కూడా సిద్దం చేస్తున్నారు. నూతన జోన్ల ప్రకారమే బదలీలు, పోస్టింగ్‌లు, వేకెన్సీ ఫిల్లింగ్‌లను పూర్తి చేస్తారు. ఆప్షన్లను జోనల్ ప్రకారమే స్వీకరించి పూర్తి చేస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital