హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉద్యోగ భర్తీ ప్రక్రియలో శరవేగంగా దూసుకుపోతూ నిరుద్యోగులకు ఉపాధిని విస్తృతం చేసిన తెలంగాణ సర్కార్ మరో 1663 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం ఆర్ధిక శాఖ ఉత్తర్వులు వెల్లడించింది. తాజా నియామక ఆమోదాల్లో ఇంజనీరింగ్ విభాగంలో 1522 ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. నీటి పారుదల శాఖలో 704 ఏఈఈ పోస్టులను, 227 ఏఈ పోస్టులను, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, భూగర్భ జలశాఖలో 88 పోస్గులు, ఆర్ అండ్ బీలో 38 సివిల్ ఏఈ పోస్టులు, ఆర్ అండ్ బీలో 145 సివిల్ ఏఈఈ పోస్టులు, ఆర్ అండ్ బీలో 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు, ఆర్ అండ్ బీలో 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, మరో 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఆర్ధిక శాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. నియాక ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు 46,998 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. మరిన్ని పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పోలీసు, అటవీ, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఇప్పటికే ఆర్ధిక శాఖ పలు ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఇక ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ విభాగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తద్వారా ఇది ఇంజనీరింగ్ పట్టభద్రులకు సువర్ణావశకంగా మారనుంది. ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి క్లీయరెన్స్ రావడంతో ఈ విభాగంలోని పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయి. ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్( హైదరాబాద్ హెడ్ క్వార్టర్ అడ్మినిస్ట్రేషన్)లో 1238 పోస్టులు, ఇంజనీరి ఇన్ చీఫ్ ఆర్ అండ్ బీ, ఎన్ హెచ్ అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబి, ఆర్‌యూబి, ఎన్‌హెచ్‌వోడి లో 284 పోస్టుల భర్తీకి శనివారం ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. వీటితోపాటు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్, హెచ్‌వోడిలో 53, డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్‌లో 88 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతించినట్లయింది. ఈ దిశగా ఆయా పోస్టుల భర్తీకి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నియామక ప్రక్రియ వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉంది. ఇప్పటికే ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉద్యోగ కల్పనలో భాగంగా గత నెలలో 1433 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పట్టణ ప్రణాళికా బిల్డింగ్ ఓవర్సియర్లు, సర్వేయర్లు, అసిస్టెంట్ టౌన్ ప్లానర్లు, డ్రాఫ్ట్ మెన్లు, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు సహా వివిధ పోస్టుల భర్తీ కార్యాచరణ జరుగుతోంది. మిషన్ భగీరథ, పురపాలక, పట్టణ ప్రణాళిక విభాగంలో ఉన్న ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఇప్పటివరకు అనుమతించిన పోస్టులు…
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -1 503
హోం 16587
హోం 231
హోం(జైళ్లు) 154
హోం(జైళ్లు) 31
రవాణా 63
రవాణా 149
హెల్త్ 10028
వైద్య, ఆరోగ్య 2662
వైద్యారోగ్య 45
అటవీ 1668
డీజీపి విపత్తు నిర్వహణ 861
ఫైర్ 14
ఎక్సైజ్ 614
టీఎస్‌బీసిఎల్ 40
పంచాయతీరాజ్ 3
గ్రామీణ నీటి పరఫరా 420
ఎన్నికల సంఘం 3
ఇంజనీర్ ఇన్ చీఫ్ 350
టీఎస్‌ఐపార్డ్ 2
మున్సిపల్ 196
ప్రజారోగ్యం 236
టౌన్ ప్లానింగ్ 223
స్త్రీ, శిశు 14
స్త్రీ శిశు 251
జైళ్లు 71
జువైనల్ సంక్షేమం 66
మైనార్టీ గురుకులాలు 1445
బీసి గురుకులాలు 3870
బీసి సంక్షేమ శాఖ 157
గిరిజన గురుకులాలు 1514
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.