Monday, January 27, 2025

TG | పురపాలికలకు స్పెషల్ ఆఫీసర్ నియామకం

  • ముగిసిన పాలకవర్గాల కాల పరిమితి
  • మంచిర్యాల నగర పాలక సంస్థలో కలిసిన నస్పూర్ మున్సిపాలిటీ

మంచిర్యాల ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : మున్సిపల్ పాలకవర్గాల కాల పరిమితి ఆదివారంతో ముగియడంతో జిల్లాలోని పురపాలికలకు స్పెషల్ ఆఫీసర్ గా ఆడీషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను నియమించారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఉత్తర్వులను జారీ చేశారు.

జిల్లాలో గతంలో ఇక్కడ అధనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పనిచేసిన రాహుల్ బదిలీపై వెళ్లగా అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో స్థానిక సంస్థలకు ఇంచార్జిగా జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ వ్యవహరిస్తున్నారు. పురపాలికల ప్రత్యేక పాలన బాధ్యతలను జిల్లా కలెక్టరే చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో ఏడు పురపాలికలుండగా మందమర్రిలో 1/70 యాక్టు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు జరగపోగా అక్కడ పాలక వర్గం లేదు. ఆ మున్సిపాలిటీ స్పెషల్ అధికారి పాలనలోనే కొనసాగుతోంది.

అదేవిధంగా నస్పూర్ మున్సిపాలిటీని నూతనంగా ఏర్పాటవుతున్న మంచిర్యాల నగర పాలక సంస్థలో విలీనం చేశారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు నేటి నుంచి మంచిర్యాల నగర పాలక సంస్థతో పాటు చెన్నూరు, క్యాతన్ పల్లి, లక్షెట్టిపేట, బెల్లంపల్లి పురపాలికల్లో ప్రత్యేకాధికారి పాలన సాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement