Monday, January 6, 2025

ADB | జన్నారం మార్కెట్ కమిటీ నియామకం..

రేపు పాలకవర్గం ప్రమాణస్వీకారం
జన్నారం, జనవరి 4 (ఆంధ్రప్రభ): జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. రేపు ఉదయం 11గంటలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పాలకవర్గం స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆ వ్యవసాయ మార్కెట్ కమిటి నూతన చైర్మన్, మండలంలోని ధర్మారం వాసి దుర్గం లక్ష్మీనారాయణ శనివారం తెలిపారు.

ఆ కమిటీ వైస్ చైర్మన్ గా సయ్యద్ ఫసిహుల్ల (పొనకల్), డైరెక్టర్లుగా ఎల్ల లావణ్య (జన్నారం), అంబటిపెల్లి నర్సయ్య (తపాల్ పూర్), ముత్యం రాజన్న (పొనకల్), బెడద సత్తయ్య (బాదంపల్లి), భీమనేని రాజన్న (పొనకల్ అక్కపల్లిగూడెం), లాకావత్ తిరుపతి(కవ్వాల రామ్ తాండ), గర్వoదుల సత్య గౌడ్ (కవ్వాల), రేగుంట ప్రదీప్( తిమ్మాపూర్), పులిశెట్టి లావణ్య (రోటిగూడ), పూసం సోనేరావు (మురిమడుగు), జిల్లా వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పొనకల్ సింగిల్ విండో చైర్మన్ అల్లం రవి, గ్రామపంచాయతీ పర్సన్ ఇంచార్జితో పాటు 16మందిని పాలకవర్గం సభ్యులుగా నియమించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement