హైదరాబాద్, ఆంధ్రప్రభ : మరో రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలక మండళ్లను నియమించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా మధిర, హైదరాబాద్ జిల్ల ఆబోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లకు నూతన ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసంది. తాజాగా నియమించిన రెండు పాలక మండళ్లతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 148 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనా పాలకవర్గ సభ్యులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.