Wednesday, January 15, 2025

Appointed l తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సుజ‌య్‌పాల్‌

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సుజ‌య్‌పాల్‌ ను రాష్ట్ర‌ప‌తి నియ‌మించారు. హైకోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్ సుజ‌య్‌పాల్‌కు సీజేగా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా బ‌దిలీ అయ్యారు.

1964 జూన్ 21న జ‌న్మించిన జ‌స్టిస్ సుజ‌య్ పాల్ బీకాం, ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. 1990లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ బార్ కౌన్సిల్‌లో పేరు న‌మోదు చేసుకున్నారు. ప‌లు బ్యాంకులు, మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్, బోర్డుల‌కు సేవ‌లందించారు. 2011 మే 27న మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా, 2014 ఏప్రిల్ 14న శాశ్వ‌త న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార‌సుతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తిగా బ‌దిలీ అయ్యారు. తాజాగా హైకోర్టు తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్‌గా నియ‌మితుల‌య్యారు

Advertisement

తాజా వార్తలు

Advertisement