బాసర, జనవరి 28, ఆంధ్రప్రభ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయానికి రెగ్యులర్ ఈవోను నియమించాలని మంగళవారం హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కోరారు.
ఫిబ్రవరి 1 నుండి 3 వరకు వసంత పంచమి ఉత్సవాల నేపథ్యంలో భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున సౌకర్యాలు అధికంగా కల్పించాలన్నారు. ఇంచార్జ్ ఈవోలతో ఇబ్బందులు పడుతున్నారని, రెగ్యులర్ ఈవోను నియమిస్తే ఇబ్బందులు తొలగుతాయని, ఆలయ అభివృద్ధికి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రూ.42కోట్ల నిధులను విడుదల చేసి అభివృద్ధి పనులను ప్రారంభించాలని కోరారు. వసంత పంచమి ఉత్సవాలకు హాజరు కావాలని ఇన్చార్జి మంత్రి సీతక్కను ఎమ్మెల్యే పవర్ రామారావు పాటే కోరారు.
- Advertisement -