Wednesday, October 30, 2024

Appeal – కుల గణన కోసం అఖిలపక్షం – స‌హ‌క‌రించాల‌న్న మంత్రి పొన్నం

బీసీ డిక్ల‌రేష‌న్‌లో భాగంగానే స‌ర్వే
రాహుల్ ఆదేశాల మేర‌కు దేశ వ్య‌ప్తంగా ప్ర‌క్రియ‌
న‌వంబ‌ర్ 6 నుంచి తెలంగాణ‌లో ప్రారంభం
పార్టీ శ్రేణులు స్థానికంగా ఉండాలి, స‌హ‌క‌రించాలి..
స‌మ‌గ్ర స‌ర్వేపై స్ప‌ష్టత‌నిచ్చిన మంత్రి పొన్నం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైదరాబాద్‌ :
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు.. దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన ప్రక్రియ న‌వంబ‌ర్ 6వ తేదీన ప్రారంభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సమగ్ర సర్వే సక్రమంగా జరిగి భవిష్యత్‌లో అందరికి సమ న్యాయం జరిగేలా సహకరించాలన్నారు. దీనికి సంబంధించి త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అధికారులకు సహకరించాలని సూచించారు.
150 ఇళ్లకు అధికారుల బృందం సమగ్ర సమాచార సేకరణ చేపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలన్నారు.

హుస్నాబాద్​ ఆస్పత్రి ​అప్​ గ్రేడ్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : హుస్నాబాద్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిని అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో వంద ప‌డ‌క‌ల నుంచి 250 ప‌డ‌క‌ల స్థాయికి పెంచారు. అప్‌గ్రేడ్‌తో మార్పులు చేయ‌డానికి ప్ర‌భుత్వం రూ.82 కోట్లు మంజూరు చేసింది. అప్‌గ్రైడ్ చేసిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌కి మంత్రి పొన్నం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement