అచ్చంపేటలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడి, హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే బాలరాజును మంత్రి కెటిఆర్ పరామర్శించారు.. అపోలో ఆసుపత్రి కి వెళ్లిన కెటిఆర్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై జరిపిన రాళ్ల దాడి గురించి బాలరాజు వివరించారు.. రోజు రోజుకి పెరుగుతున్న ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్ కి తెలిపారు బాలరాజు కుటుంబ సభ్యులు.. దీనిపై స్పందిస్తూ ఉద్యమ కాలంలో ఇలాంటి ఎన్నో దాడులను ఎదుర్కొని తెలంగాణ పోరాడిన నాయకుడు బాలరాజని, ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘర్షణపై రాష్ట్ర డిజిపి తో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతానని వెల్లడించారు.. అలాగే బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న కేటీఆర్ అవసరమై అన్ని వైద్య సేవలు అందించాలని కోరారు..
Apolloలో బాలరాజుకి కెటిఆర్ పరామర్శ .. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా..
Advertisement
తాజా వార్తలు
Advertisement