ఆయన ఇంటిని ప్రకాశం జిల్లా పోలీసులు రౌండప్
హైదరాబాద్ నుంచి ఆర్జీవీ గాయబ్
కోయంబత్తూరులో ఉన్నట్లు సమాచారం
తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎపి పోలీసులు
హైదరాబాద్ లోనే సీనియర్ నటుడి ఇంటిలో ఆర్జీవికి ఆశ్రయం
వర్చవల్ విధానంంలో విచారణకు సిద్దమన్న ఆర్జీవీ
తిరస్కరించిన ఒంగోలు పోలీసులు
వర్మ కోసం తెలంగాణ పోలీసుల సహకారంతో వేట
హైదరాబాద్ – రెండు సార్లు నోటీస్ ఇచ్చినా విచారణకు హాజరుకాలేకపోయిన వివాద స్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఒంగోలు పోలీసులు సీరియస్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో వర్మను అరెస్టు చేసి ఒంగోలు తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఆర్జీవీ మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ లో ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఆర్జీవీ ని ట్రాక్ చేసేందుకు తెలంగాణ పోలీసుల సాయం కోరారు ఎపి పోలీసులు పోలీసులు. ఆయన కోయంబత్తూరులో ఉన్నట్లు ఫోన్ ట్రాకింగ్ తో తెలసుకున్న పోలీసులు తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. అక్కడ ఉంటే ఆయనను అరెస్ట్ చేయవలసిందిగా అభ్యర్ధించారు.
ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లోని వర్మ ఇంటికి నేటి ఉదయం పోలీసులు చేరుకున్న వెంటనే ఆయన అజ్నాతవాసంలోకి వెళ్లిపోయారు.. ఇదే సమయంలో వర్మ న్యాయవాది వర్చువల్ విధానం లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ రెక్వెస్ట్ చేశారు. అందుకు పోలీసులు తిరస్కరించారు. అవకాశం ఇచ్చేది లేదని తేల్చేశారు పోలీసులు. ఆయన కోరిన విధంగా రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదంటున్నారు. పోలీసు అధికారుల నోటీసులు ధిక్కరించారు కాబట్టే చట్టప్రకారం ఆర్జీవీ ని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కాగా, వర్మకు హైదరాబాద్ లోనే ఒక సీనియిర్ నటుడు ఆశ్రయించినట్లు వార్తలు వినవస్తున్నాయి.
ధర్డ్ డిగ్రీకి వర్మ భయపడ్డారా…
ఇక ఈ కేసు విషయం మీద రామ్ గోపాల్ వర్మ లాయర్ స్పందించారు. దేశం ఇంత అభివృద్ధి చెంది ముందుకు దూసుకుపోతున్న కారణంగా ఫిజికల్ గా కాకుండా వర్చువల్ గా హాజరవుతామని చెబుతున్నారు. అంతేకాక ఆయన బిజీ డైరెక్టర్ కావడంతో ఆ సదుపాయం కోసం కోరినట్టు చెబుతున్నారు. అయితే థర్డ్ డిగ్రీకి వర్మ భయపడ్డారా? అని అడిగిన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా థర్డ్ డిగ్రీకి వర్మ భయపడడు అని వర్మ తరపు లాయర్ చెప్పుకొచ్చారు.