హైదరాబాద్ – సిద్దిపేటలో అప్పుల బాధతో ఓ ఆటో డ్రైవర్ శుక్రవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు…దీనిపై బిర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఆటోడ్రైవర్లకు ఇస్తానన్న రూ.12వేల సాయం ఏమైందని సీఎం రేవంత్‌ను నిలదీశారు. ఆటో డ్రైవర్లతో పాటు అన్ని వర్గాలను మోసగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ట్విట్ చేశారు.
“ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో ధగ ధగ మెరిసిన చేతుల్లోకి పురుగు మందు డబ్బాలు రావడమే మార్పా? ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? రేవంత్.. ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న రూ. 12వేల సాయమేది? రాహుల్ గాంధీ.. ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను మోసగించారు. తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు. ఇదే ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు!” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.