Wednesday, November 20, 2024

AP Assembly – జల్ జీవన్ మిషన్ తో కిడ్నీ సమస్యలకు చెక్ – పవన్ కల్యాణ్

కేంద్ర పథకం ద్వారా ఎపిలోని అన్నిగ్రామాల‌కు స్వ‌చ్చ‌మైన నీరు
2027 నాటికి ఎపిలో అన్ని ప్రాంతాల‌కు జ‌ల్ జీవ‌న్
రెండేళ్ల‌లో క‌లుషిత నీరు మాట వినిపడ‌కుండా చేస్తాం
అసెంబ్లీలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ వెల్ల‌డి

అమరావతి: రక్షిత మంచి నీరు.. ప్రతిఒక్కరి హక్కు అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తెలిపారు. జలజీవన్‌ మిషన్‌పై శాసనసభలో పశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రతి ఇంటికి తాగు నీరందిస్తామని భరోసా ఇచ్చారు. జలజీవన్‌ మిషన్‌ అమలులో ఏపీ దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

ఒక ఉద్ధానంలోనే కాదు.. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారని వెల్లడించారు పవన్ కల్యాణ్.. .. జలజీవన్ మిషన్ కు కమిటెడ్ లీడర్ షిప్ కావాలన్నారు.. కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. కలుషిత నీరు అనే మాట వినపడకుండా చేస్తామని.. కిడ్నీ సమస్యలు తగ్గిస్తామని చెప్పారు. చాలా ఆర్వో ప్లాంట్లు పాడైపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా, వాటిని పునరుద్ధరిస్తామని తెలిపారు. మార్చి 2027లో జలజీవన్ మిషన్ పూర్తయిపోవాలి.. ఈ లోపు ప్రతీ ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు అందాలని స్పష్టం చేశారు.. కాగా, అన్నమయ్య జిల్లాలో ఒక దళిత పెద్దావిడ నీళ్లివ్వమని అడిగితే నాకు కన్నీళ్లు వచ్చాయి అంటూ ఆ ఘటనను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement