Wednesday, November 20, 2024

యాంటీ హ్యూమన్​ ట్రాఫికింగ్​.. తెలంగాణలో వికారాబాద్ జిల్లా టాప్​

వికారాబాద్ (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోనే అగ్ర భాగంలో వికారాబాద్ జిల్లా యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ యూనిట్ నిలిచిందని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి అన్నారు. విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపి షికాగోయల్ చేతుల మీదుగా ఏహె్చ్‌టి‌యూ టీం వికారాబాద్ ఇన్స్పెక్టర్ వి. దాసు కు ప్రశంసా పత్రం దక్కింది. విమెన్ సేఫ్టీ వింగ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో 2022 సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఉన్న 31 ఏహెిచ్‌టి‌యూ టీమ్ లలో వికారాబాద్ జిల్లా యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ యూనిట్ టీమ్ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్ర భాగంలో నిలిచింది.

వికారాబాద్ జిల్లా ఏహెూచ్‌టి‌యూ టీమ్ విధి నిర్వహణలో భాగంగా బాలకార్మిక వ్యవస్థ నిర్ములన గురించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. 18 సంవత్సరాల లోపు బాలబాలికలు జిల్లాలోని కర్మాగారలలో పని చేస్తున్న వారి గురించి సమాచారం సేకరించారు. ఆపరేషన్ స్మైల్ & ముస్కాన్ ద్వారా గత సంవత్సరం లో సుమారు 316 మంది పిల్లలను కాపాడారు. వారికి చైల్డ్ వెల్ఫేర్ కమిటి ముందు ఇతర శాఖల సమన్వయంతో వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించారు. వారు మళ్ళీ బడికి వెళ్ళే విధంగా ప్రోత్సహించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement