జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పోలీసులకు అందజేసిన వీడియోల్లో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్టు సీసీ ఫుటేజీ ఆధారాల్లో వెల్లడయ్యినట్టు తెలుస్తోంది. కాగా దీనిపై మరింత క్లారిటీ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు లీగల్ ఒపీనియన్ కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం. అయితే.. ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడు లేడని ఇప్పటిదాకా చెబుతున్న పోలీసులకు ఇది కాస్త విషమ పరీక్ష అనే చెప్పుకోవచ్చు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా మరో నిందితుడిని కేసులో చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా.. ఇప్పటికే ఆ ఎమ్మెల్యే కుమారుడు.. మరో నిందితుడు అయిన సదరు వ్యక్తి విదేశాలకు చెక్కేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఇదంతా పోలీసులు కావాలనే చేశారని, ముందునుంచే వారిపై బీజేపీ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లు అనుమానించిందే నిజం అయ్యిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బాలిక రేప్ కేసులో నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా గుర్తించారు. ఈ కేసులో A1 గా సాదుదీన్ (ఎంఐఎం నేత కొడుకు), ఉమెర్ ఖాన్ (ఓ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు), మైనర్ 1 (కార్పొరేషన్ చైర్మన్ కొడుకు), మైనర్ 2 (ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు), మైనర్ 3 (సంగారెడ్డి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ కొడుకు), మైనర్ 4 (ఎమ్మెల్యే కొడుకు)గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్నపటికే సాధుద్దీన్తో పాటు ముగ్గురు మైనర్ లను అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు మైనర్ లను జువెనైల్ హోమ్ కు తరలించారు. ఇంకొకరి కోసం గాలింపు చర్డియలు చేపట్టినట్టు డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు.