మంచిర్యాల మున్సిపాలిటీని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ లపై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ నిర్వహించారు.. అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 26మంది కౌన్సిలర్స్, బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్ పాల్గొన్నారు.
మొత్తం 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేశారు. దీంతో మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీకే దక్కాయి. కాగా అవిశ్వాస తీర్మానంలో తమకు మెజారిటీ లేదని.. తీర్మానానికి ముందే బీఆర్ఎస్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ రాజీనామా చేశారు. ఇది ఇలా ఉంటే అవిశ్వాస తీర్మాన నివేదికను స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో రాములు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కు అందజేశారు.