Wednesday, November 20, 2024

ఆర్టీసీకి మరో సమస్య.. 200 కోట్ల బెనిఫిట్ పేమెంట్స్ పెండింగ్..

ప్ర‌భ‌న్యూస్: ఆపసోపాలు పడుతూ కాలానుగుణంగా పరుగులు తీస్తున్న ఆర్టీసీకి మరో కొత్త కష్టం వచ్చిపడింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ డబ్బుల భారం తడిసి మోపెడు అవుతుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీలో దీర్ఘకాలం పనిచేస్తున్న 659 మంది ఉద్యోగులు డిసెంబర్‌లో రిటైరవుతున్నారు. బెనిఫిట్స్‌ కింద వీరికి యాజమాన్యం సుమారు రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గడచిన రెండు, మూడేళ్ళుగా రిటైరైన వారికి రావాల్సిన బెనిఫిట్స్‌ ఇంకా అందలేదు.

తాజాగా మరింత మంది రిటైరవుతుండటంతో చెల్లింపులు ఎలా చేయాలన్నది సమస్యగా మారింది. ఈ డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు జరపాల్సిన చెల్లింపులు తలకు మించిన భారంగా మారనున్న నేపథ్యంలో ఉద్యోగ విరమణ పెంపును మరో ఏడాది పొడిగిస్తే ఎలా ఉంటుందన్న చర్చకూడా మొదలైంది. ఆర్టీసీలో ఇప్పటికే రిటైర్మెంట్‌ వయసు 60 సంవత్సరాలుగా ఉంది. దీన్ని 61 సంవత్సరాలకు మారిస్తే కొంత మేర ఆర్థిక వెసులు బాటు లభిస్తుందని అధికారులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement