Friday, November 22, 2024

Telangana: నిజామాబాద్ జిల్లాలో మ‌రో కొత్త మండ‌లం.. నోటిఫికేషన్​ జారీ!

రాష్ట్రంలో మ‌రో కొత్త మండ‌లాన్ని ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో పోతంగ‌ల్‌ను మండ‌ల కేంద్రంగా చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ప్రాథ‌మిక నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. 14గ్రామాల‌తో పోతంగ‌ల్ మండ‌లాన్ని ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌లున్నాయి. అభ్యంత‌రాలు, విన‌తుల‌ను 15 రోజుల్లోపు నిజామాబాద్ క‌లెక్ట‌ర్‌కు స‌మ‌ర్పించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

కాగా, రాష్ట్రంలో ఇప్ప‌టికే కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఏర్పాటుకు గతంలోనే ప్రాథమిక నో టిఫికేషన్‌ ఇచ్చింది. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 3 మండలాలు ఏర్పడగా, సిద్దిపేట, మహబూబాబాద్‌, జగిత్యాలలో రెండు చొప్పున ఏర్పాటు చేశారు.

కొత్త మండ‌లాలు ఇవే..
నిజామాబాద్ – ఆలూర్‌, డొంకేశ్వర్‌, సాలూరా(తాజాగా పోతంగ‌ల్)
సిద్దిపేట – అక్బర్‌ పేట్‌-భూంపల్లి, కుకునూరుపల్లి
మహబూబాబాద్ – సీరోలు, ఇనుగుర్తి
జగిత్యాల – ఎండపల్లి, భీమారం
సంగారెడ్డి – నిజాంపేట్‌
నల్లగొండ – గ‌ట్టుప్పల్‌
కామారెడ్డి – డోంగ్లి
మహబూబ్‌నగర్ – కౌకుంట్ల

Advertisement

తాజా వార్తలు

Advertisement