తెలంగాణలో రూ. 934 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ ఇవ్వాల (శుక్రవారం) వెల్లడించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ తయారీ పరిశ్రమ పెట్టాలని కార్నింగ్ కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదిరిందని మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ.. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారు చేయడానికి తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో 800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement