హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. ఈ తెల్లవారు జామున నగరంలోని బొల్లారం పరిధిలో ఓ వైద్యుడు కారుతో తోపుడు బండ్లపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో సయ్యద్ పాష అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదం జరిగిన కూడా ఆగకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్లాడు. దీన్ని గమనించిన అక్కడి స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. దీంతో గాయపడ్డ సయ్యద్ పాషాను తన ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని చెప్పి బాధితుడిని కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పాషాను చేర్పించి అక్కడి నుంచి వైద్యుడు పరారయ్యాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని, బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు వాపోయారు.