తెలంగాణకు మరో భారీ సంస్థ రాబోతోంది. 700 కోట్ల రూపాయలతో ఎలక్ట్రానిక్స్ మోడ్యుల్స్ తయారీ చేసేందుకు ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా వివరాలు షేర్ చేశారు.
ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్ & అజూర్ పవర్ మధ్య మంత్రి కేటీఆర్ వ్యూహాత్మక కూటమిని రూపొందించారు.1.25 GW సోలార్ సెల్ & 1.25 GW సోలార్ మాడ్యూల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ ముందుకు వచ్చింది.
దీని ద్వారా 1000 మందికి ప్రత్యక్ష ఉపాధిని, 2000 మందికి పరోక్ష ఉద్యోగాలను కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఇదంతా స్థానిక యువతకు ఉపాధిని కల్పించడానికి రూ. 700 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.