అన్నం పెట్టే అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి జమ చేసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పెద్దపల్లి తెరాస పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కొరత ఉండేదిని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెరాస పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మాధవి, పద్మ గీతాంజలి, అష్రఫ్ ముబిన్, చంద్రశేఖర్, పురుషోత్తం, శ్రీధర్, స్వామి, బిక్షపతి, జాకిర్ హుసేన్, చంద్రమౌళి, ఫహీమ్, కుంభం సంతోష్, వెన్నం రవితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital