Wednesday, September 18, 2024

Announced – రాజ్య‌స‌భ కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా అభిషేక్ సింఘ్వీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ హైద‌రాబాద్ – కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు అభిషేక్ సింఘ్వీ రాజ్య‌స‌భ కు ఎన్నిక‌కానున్నారు.. తెలంగాణకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కె కేశ‌వరావు త‌న రాజ్య స‌భ స‌భ్య‌త్వానికి ఇటీవ‌ల రాజీనామా చేశారు.. దీంతో ఈ స్థానానికి నిర్వ‌హించే ఉప ఎన్నిక కోసం ఎన్నిక‌ల క‌మిష‌న్ నేడు నోటిపికేష‌న్ విడుద‌ల చేసింది.. ఈ స్థానానికి సెప్టెంబ‌ర్ మూడో తేదిన అవ‌స‌ర‌మైతే ఎన్నిక జ‌రుపుతారు.. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ నేడు త‌మ అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించింది.. సీనియ‌ర్ నేత అభిషేక్ సింఘ్వీ కి అవ‌కాశం క‌ల్పించింది.ఆయ‌న ఈ నెల 21వ తేది లోగా నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.. ప్ర‌స్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఉన్న బ‌లం దృష్ట్యా ఆయ‌న ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యే అవ‌కాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement