Thursday, November 28, 2024

ప్రభుత్వ బడుల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలు..

హైదరాబాద్‌, (ప్ర‌భ‌న్యూస్):తెలంగాణ రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు ఇక ప్రభుత్వ బడుల్లోకి తరలించనున్నారు. ఈమేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గదుల అందుబాటును బట్టి అంగన్‌వాడీలను తరలించనున్నారు. ఈ నేపథ్యంలో వాటిని సర్కారు బడుల్లోకి తరలించి, ప్రతి స్కూల్‌ల్లో ఒక గదిని వాటికి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 15వేల వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే నడుస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే 58 శాతం అంగన్‌వాడీ కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. వీటికి అద్దె రూపంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నెలకు రూ.30 నుంచి 40 కోట్లను చెల్లిస్తుంది.

కేంద్ర ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాలల విద్యలో విలీనం చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఇకమీదట అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటయో..ఉండవో అన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ ఎన్‌ఈపీని తెలంగాణలో అమలు చేయాల్సి వస్తే అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పాఠశాలల్లో ఉన్న కేంద్రాలను అక్కడికక్కడే విలీనం చేసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement