ఆంధ్రప్రభ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి…
నిజాంపేట : నిజాంపేట మండల కేంద్రంలో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆంధ్రప్రభ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 87సంవత్సరాలుగా పత్రికా రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువుగా ఆంధ్రప్రభ మారిందన్నారు.
నిజాలను నిర్భయంగా రాసి ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నఆంధ్రప్రభ దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి, రైటర్ వినోద్, ఆమని, నవీన్, నిజాంపేట మండల ఆంధ్రప్రభ రిపోర్టర్ చంద్రకాంత్ గౌడ్, దుర్గయ్య, దుబాసి సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -