Sunday, January 5, 2025

RR | ఎవర్ గ్రీన్ పత్రిక… ఆంధ్రప్రభ..!

  • ప్రభుత్వానికి, ప్రజలకు వారిధిగా కథనాలు
  • తాండరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
  • ఘనంగా పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

తాండూరు : సమాజంలోని అక్రమాలపై అక్షరాలను సంధిస్తూ విజయాల వెలుగు అందిస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక మరింత దూసుకపోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రభ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆంధ్రప్రభ విలేకరి శాంతు, పెద్దేముల్ మండల విలేకరి లక్ష్మారెడ్డిల సమక్షంలో నేతలతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… దేశ స్వాతంత్రానికి పూర్వం 1938 నుంచి ఆంధ్రప్రభ పత్రిక అందరి అభిమానంను చూరగొంటుందన్నారు. పత్రికల విలువలు పాటిస్తూ సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రజలకు వివరిస్తూ సారథిగా నిలుస్తోందన్నారు.

సమాజంలోని అక్రమాలు, అవినీతిపై పోరాటం చేస్తూ అక్షర విజయాలను సాధిస్తోందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ ఎడిషన్ పేరుతో డిజిటల్ పత్రికను కూడా అం దుబాటులోకి తీసుకరావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రభ యజమాన్యంకు, సిబ్బందికి, జర్నలిస్టులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు డా. సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సర్దార్ ఖాన్, లైబ్రరీ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, భీమయ్య, పి. మహిపాల్ రెడ్డి, కోట్ పల్లి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి. చెన్నారం అనిల్ కుమార్, వడ్డె శ్రీనివాస్, ఉప్పరి మల్లేశం, మార్కెట్ కమిటి డైరెక్టర్లు జరప్ప, రాజు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగో పాల్, కందనెల్లి కిరణ్, చిట్టిగణాపూర్ ప్రభాకర్ రెడ్డి, హైమద్, ఉపాధ్యాయ సంఘం నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement