Monday, January 6, 2025

MDK | దినపత్రికల్లోనే ఆంధ్రప్రభకు గొప్ప చరిత్ర … దామోద‌ర రాజ‌న‌ర్సింహా

దిన పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి..
ఆంధ్రప్రభ నూతన క్యాలెండర్, డైరీ ఆవిష్కరణలో
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా
జోగిపేట, జనవరి2 (ఆంధ్రప్రభ) : దినపత్రికల్లోనే ఆంధ్రప్రభ గొప్ప చరిత్ర కలిగి ఉందని, స్వాతంత్రం రాకముందే వార్తల రూపంలో పాఠకుల ముందుకు వచ్చిన పత్రిక ఆంధ్రప్రభ అని, దినపత్రికలు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ప్రజా సమస్యలను ప్రచురించి జవాబుదారీగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఆంధ్రప్రభ 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మంత్రి దామోదర్ ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రభ నూతన క్యాలెండర్ బాగుందని కితాబిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వార్తలను వెలికితీసి ప్రభుత్వానికి తెలియజేస్తూ, సమస్యలపై ఆంధ్రప్రభ నిరంతరం కృషి చేయడం శుభపరిమాణం అన్నారు. మున్సిపల్ పట్టణంతో పాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కూడా ఎప్పటికప్పుడు ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై వార్తల రూపంలో ప్రచురించి దినపత్రికలు కృషి చేయాలని ఆయన సూచించారు. పట్టణ ప్రాంతాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న నేటి సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు.

కరోనా సమయంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివ‌న్నారు. వార్తల రూపంలో కరోనా కట్టడికి దిన పత్రికలు ఎంతో కృషి చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ జోనల్ మేనేజర్ సాయికుమార్, ఉమ్మడి మెదక్ బ్యూరో ఇంచార్జ్ కొడారి ప్రశాంత్ రెడ్డి, సంగారెడ్డి స్టాఫ్ రిపోర్టర్ పరంజ్యోతి, సంగారెడ్డి రిపోర్టర్ విజయ్, ఆర్ సీ పురం రిపోర్టర్ కాశీపతి, అమీన్పూర్ రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి, అందోల్ ఆర్ సి జి. కుమార్, టేక్మాల్, వట్ పల్లి, అల్లాదుర్గం రిపోర్టర్లు నర్సింలు, భాగయ్య, రఘుపతి, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement