Tuesday, November 19, 2024

Andhra Prabha’s Effect – సీడీఎంఏ కమిషనర్ వీపీ గౌతమ్ ఆకస్మిక తనిఖీ

కుత్బుల్లాపూర్, ఆగస్టు 5 (ప్రభ న్యూస్): నిజాంపేట్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆంధ్రప్రభ గత 5 రోజులుగా అక్షర పోరాటం చేస్తుంది. ఆంధ్రప్రభలో వస్తున్న వరుస కథనాలకు సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) వీపీ గౌతమ్ ఐఏఎస్ సోమవారం నిజాంపేట్ కార్పొరేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. నేరుగా నిజాంపేట్ కార్పొరేషన్ లోని డంపింగ్ యార్డుకు చేరుకుని చెత్త సేకరణ – తరలింపు పై ప్రశ్నించారు.

ప్రధాన వీధులను సైతం ఆకస్మిక తనిఖీ చేసి చెత్త సేకరణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

*చెత్త శుద్దీకరణ పై ప్రశ్నలు*

సుమారు 3లక్షల జనాభా కల్గిన పెద్ద కార్పొరేషన్ నిజాంపేట్ లో చెత్త శుద్దీకరణ ఎందుకు జరగడం లేదని కమిషనర్ రామకృష్ణ ను ప్రశ్నించారు. బయో మైనింగ్ ఏర్పాటును తక్షణం పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

*ఆంధ్ర ప్రభ వరుస కథనాలపై…

ఇంటినెంబర్ల మాయాజాలం, చెత్త తరలింపు, స్వచ్చ ఆటోలు, ప్రైవేట్ ఆటోల నుండి దోపిడీ, హరితహారంలో అవినీతి- దోపిడీల పై ఇలా వరుస కథనాలు ఎందుకు వస్తున్నాయని అడ్మినిస్ట్రేషన్ లో పూర్తిగా విఫలమయ్యావని కమిషనర్ ను తూర్పారబట్టారు. ఆంధ్రప్రభ కథనాలపై లిఖిత పూర్వక సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement