మహదేవపూర్ పిఎస్ లో పోలీస్ స్టేషన్లో రాజకీయ నేత డాన్స్
ఆంధ్రప్రభ వార్తకు స్పందించిన ఎస్పి కిరణ్ ఖరే
విచారణ అనంతరం హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ …
ఎస్ఐ విఆర్ కు బదిలీ….
మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఓ రాజకీయ పార్టీ నేత డాన్స్ చేసిన ఘటనలో పోలీస్ స్టేషన్ ఇన్చార్జిగా ఉండి, విధి నిర్వహణలో అలసత్వం విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాఎస్పీ కిరణ్ ఖరే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ ఘటనలో మహాదేవ్ పూర్ ఎస్ హెచ్ ఓ ప్రసాద్ ను మహదేవ్పూర్ పిఎస్ నుండి వెకెన్సీ రిజర్వు కు బదిలీ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ, ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం వహించొద్దని అన్నారు. ప్రజల్లో పోలీసు శాఖపై ప్రతిష్ఠ పెంచే విధంగా పనితీరు ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు.