Sunday, January 5, 2025

MDK | సంచలన కథనాలకు కేంద్ర బిందువు ఆంధ్రప్రభ.. నీలం మధు ముదిరాజ్


ఉమ్మడి మెదక్ బ్యూరో, జనవరి 3 (ఆంధ్ర ప్రభ) : సంచలనాలకు కేంద్ర బిందువు ఆంధ్రప్రభ దినపత్రిక అని మెదక్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండీడేట్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్ చేరు నియోజకవర్గం చిట్కూల్ గ్రామంలో శుక్రవారం ఆంధ్రప్రభ నూతన సంవత్సర క్యాలెండర్ ను నీలంమధు ముదిరాజ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

అనంతరం నీలం మధు మాట్లాడుతూ… గత 87 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువుగా ఆంధ్రప్రభ మారిందన్నారు. ఆంధ్రప్రభతో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇప్పటికే అదే క్వాలిటీతో కేవలం ప్రజాపక్షమే తన ధ్యేయంగా విలువలు, వాస్తవాలకు కట్టుబడి వార్తలను ప్రచురించడంలో ఆంధ్రప్రభ తన మార్కును చాటుకుంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు ఆర్ఏం సాయికుమార్, బ్యూరో ప్రశాంత్ రెడ్డి, ఆంధ్రప్రభ విలేకర్లు రామ చంద్రపురం మండలం కాశీపతి, జిన్నారం మండలం శ్రీనివాస్, పటాన్ చేరు మండలం ప్రమోద్ గౌడ్, అమీన్ పూర్ మండలం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement