Monday, January 6, 2025

HYD | సంచలన కథనాలకు కేంద్ర బిందువు ‘ఆంధ్రప్రభ’

  • గండిపేట మండలంలో ప్రజా సమస్యలపై గళం
  • పరిష్కారానికి పాటుపడడంలో అలుపెరగని పోరాటం
  • 87ఏళ్లుగా ప్రతికా రంగంలో చెరగని ముద్ర సొంతం
  • దశాబ్దాలుగా నాణ్యతతో ప్రజల పక్షాన నిలుస్తూ సమరం
  • రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ ప్రశంసలు
  • ‘ఆంధ్రప్రభ’ గండిపేట మండల నూతన క్యాలెండర్ విడుదల


గండిపేట, జనవరి 4(ఆంధ్రప్రభ): సంచలన కథనాలకు కేంద్ర బిందువు ‘ఆంధ్రప్రభ’ అని, గండిపేట మండలంలో ప్రజా సమస్యలపై గళమెత్తిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ కొనియాడారు. సమస్యలు లేవనెత్తడమే కాదు.. వాటి పరిష్కారానికి పాటు పడడంలో అలుపెరగని పోరాటం సాగించిన ఘనత ‘ఆంధ్రప్రభ’కు సొంతమ‌ని ప్రశంసలు కురిపించారు. 87ఏళ్లుగా ప్రతికా రంగంలో చెరగని ముద్ర సొంతం చేసుకున్నదని పేర్కొన్నారు. శనివారం ‘ఆంధ్రప్రభ’ గండిపేట మండల నూతన క్యాలెండర్ (2025)ను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, నార్సింగి మున్సిపల్ చైర్ పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్, గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ తలారి మల్లేష్, నార్సింగి మార్కెట్ చైర్మన్ వేణుగౌడ్, నార్సింగి మాజీ చైర్ పర్సన్ రేఖా యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ… గండిపేట మండలంలో ‘ఆంధ్రప్రభ’ సాగించిన ప్రజా పోరాటాలను, సమస్యలపై ప్రచురించిన కథనాలను ప్రస్తావించారు. అవినీతి, అక్రమాలపై వరుస కథనాల ద్వారా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని పేర్కొన్నారు. రెగ్యులర్, వెబ్ సైట్, స్పాట్, డిజిటల్ మీడియా.. ఇలా ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేసిందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజాపక్షమే ధ్యేయంగా విలువలు, వాస్తవాలకు కట్టుబడి వార్తలను ప్రచురించడంలో ఆంధ్రప్రభ తన ముద్ర చాటుతోందన్నారు.

కాగా, నాణ్యంగా, వేగంగా కథనాలు ఇవ్వడంలో గండిపేట ‘ఆంధ్రప్రభ’ విలేకరి గంటా విజయ్ కుమార్ ఎప్పుడూ ముందుంటారని ప్రకాశ్ గౌడ్ కొనియాడారు. ప్రజా సమస్యలు, కాలనీల్లో ఇబ్బందులు, కార్మికుల నిరసనలు, బాధితుల ఆందోళనలు.. ప్రతిభ చాటిన విద్యార్థులు, సత్తాచూపిన యువకులు.. ఇలా స్పాట్ వార్త ఏ ఒక్కటీ మిస్ అవకుండా ఇవ్వడంలో విజయ్ ది అందవేసిన చేయి అని అభినందించారు. ఇదే చురుకుదనాన్ని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని సూచించారు. కాగా, ‘ఆంధ్రప్రభ’ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. మరోవైపు ‘ఆంధ్రప్రభ’ కొత్త సంవత్సర క్యాలెండర్ ను మణికొండ ది సిటిజన్స్ కౌన్సిల్ వారు సైతం ఆవిష్కరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement