Thursday, December 26, 2024

WGL | పేద ప్రజల పక్షపాతి ఆంధ్రప్రభ..

-2025 క్యాలెండర్లను ఆవిష్కరించిన యశశ్విని, ఝాన్సీ రెడ్డిలు
తొర్రూరు, డిసెంబర్25 (ఆంధ్రప్రభ) : పేద ప్రజల పక్షాన నిలబడి … వారి గొంతుకగా ఆంధ్రప్రభ పత్రిక నిలుస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు అన్నారు. ఆంధ్రప్రభ 2025 నూతన సంవత్సర క్యాలెండర్లను పత్రికా ఆర్ సి ఇన్చార్జ్ లకావత్ యాదగిరి నాయక్ ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డిలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వాతంత్రోద్యమ కాలం నుంచి అక్షరాలను అగ్ని కణాలుగా మలిచి ఆంధ్రప్రభ దినపత్రిక సమాజంలోని అన్యాయాలు, అక్రమాలను, అణచివేతలను ఎదురీదిందని తెలిపారు. ప్రజా గొంతుకగా దశాబ్ద కాలం నుంచి పత్రిక ప్రస్థానం కొనసాగుతుందని గుర్తు చేశారు. దోపిడీని, అవినీతిని బహిర్గతం చేసి ధైర్యాన్ని నూరిపోసి, పాలకులపై తిరగబడే విధంగా పత్రికా ప్రజలను సమాయత్తం చేసిందన్నారు. తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన పత్రికల్లో ఆంధ్ర ప్రభకు సుస్థిర స్థానం ఉందన్నారు.

అక్రమ దందాలు, భూ కబ్జాలపై , యువతను పెడదోవ పట్టిస్తున్న మత్తు పదార్థాలపై వేరవకుండా కథనాలు అందించిన చరిత్ర ఆంధ్రప్రభ కు ఉందన్నారు. రాజకీయ, సామాజిక, వ్యాపార, క్రీడా, సాంస్కృతిక, ఆరోగ్యం, మహిళా సంబంధిత అంశాలపై వాస్తవిక కథనాలు అందించి పాఠ‌కుల మన్ననలు పొందుతున్నదని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధివిధానాలు ఎప్పటికప్పుడు తాజాగా అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పత్రిక పని చేస్తుందన్నారు.

- Advertisement -

1938 నుండి ఆకర్షించే, ఆలోచింపజేసే ఎన్నో కథనాలు అందిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొందన్నారు. ఆంధ్రప్రభ అందిస్తున్న వార్తలు, కథనాలపై స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , ఝాన్సీ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తోరూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, తొర్రూరు మండల అధ్యక్షుడు సుంచు సంతోష్,పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమాండ్ల నరేందర్ రెడ్డి, గంజి ప్రసాద్ రెడ్డి,తూనం శ్రావణ్ కుమార్,చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్, గంజి దేవేందర్ రెడ్డి,తాళ్లపల్లి బిక్షం గౌడ్,రాజేందర్, చిదిరాల రవి, బానోత్ ప్రవీణ్ నాయక్, చంటి, రవీందర్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement