Saturday, December 28, 2024

WGL | సమగ్ర కథనాల సమాచార మాలిక ‘ఆంధ్రప్రభ’

నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : సమగ్ర కథనాల సమాచార మాలిక ఆంధ్రప్రభ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయశంకర్ జిల్లా ఆంధ్రప్రభ 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించి ఆంధ్రప్రభ యాజమాన్యానికి, రిపోర్టర్లకు, పాఠకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే కాకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుందన్నారు. డిజిటల్ వెబ్ విభాగంతో పాటు ఆంధ్రప్రభ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేరవేస్తూ క్షణాల్లో సమాచారాన్ని పాఠకులకు అందించడంలో ముందుందన్నారు. సమజాన్ని చైతన్య పరచడంతో పాటు సంచనల కథనాలతో ఆంధ్రప్రభ ముందుందన్నారు.

- Advertisement -

ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రభ భూపాలపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పావుశెట్టి శ్రీనివాస్, రిపోర్టర్లు బెల్లం తిరుపతి, అరిగెల జనార్దన్, బుర్ర చక్రపాణి, పసునూటి రవి, గంగిరేని రమేష్, జయశంకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కొమురయ్య, పీసీసీ సభ్యులు మధు. టౌన్ అధ్యక్షులు దేవన్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెప్పాల రాజేందర్, కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్, జిల్లా నాయకులు అప్పం కిషన్, అంబాల శ్రీనివాస్, తోట రంజిత్, క్యాత రాజు సాంబమూర్తి, మహిళా నాయకురాల్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement