- ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అర్బన్ ఎమ్మెల్యే..
నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజల సమస్యల్ని అధికార యంత్రాంగానికి చేరవేసే వారధి ‘ ఆంధ్రప్రభ’ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో ఆంధ్రప్రభ క్యాలెండర్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా వినూత్నంగా పత్రిక రూపాంతరం చెందుతూ ప్రజలు, అధికారులకు చేరువ కావడం గొప్పవిషమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రతినిధి ఇంగు శ్రీనివాస్ గుప్తా, సర్కులేషన్ మేనేజర్ దామోదర్ రెడ్డి, అకౌంటెడ్ చంద్రశేఖర్, నవీపేట విలేఖరి మోయిజ్, మాక్లూర్ విలేఖరి అరుణ్, స్టాప్ ఫోటోగ్రాఫర్ సితారే కృష్ణ, కార్తీక్ లు పాల్గొన్నారు.
- స్వాతంత్రోద్యమ నాటి పత్రిక ఆంధ్రప్రభ : అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
స్వాతంత్రోద్యమ నాటి పత్రిక ఆంధ్రప్రభ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనా రాయణ ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వారధిగా ఆంధ్రప్రభ కథనాలు ఉంటాయన్నారు. సుదీర్ఘ చరిత్ర ఆంధ్రప్రభకే సొంతమని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ కొనియాడారు.