Wednesday, December 25, 2024

TG | స‌మాజ‌సేవ‌లో ‘ఆంధ్రప్రభ’.. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

2025 క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
యాజ‌మాన్యం, సిబ్బందికి అభినంద‌న‌లు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖ‌మ్మం సిటీ : అక్ష‌రంతో ఆంధ్ర‌ప్ర‌భ స‌మాజ‌సేవ చేస్తున్న ఆంధ్ర‌ప్ర‌భ మ‌రింత అభివృద్ధి చెందాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. మంగ‌ళ‌వారం త‌న క్యాంపు కార్యాల‌యంలో ఆంధ్ర‌ప్ర‌భ‌-2025 క్యాలెండ‌ర్‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక క‌థ‌నాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందిస్తూ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి వార‌ధిలా ప‌నిచేస్తున్న ఆంధ్ర‌ప్ర‌భ సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ యాజమాన్యం, ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.


ఆంధ్ర‌ప్ర‌భ మ‌రింత అభివృద్ధి చెందాల‌ని భ‌ట్టి ఆకాంక్ష‌…
సామాజిక అభివృద్ధిలో ఆంధ్రప్రభ చేస్తున్న కృషిని డిప్యూటీ సీఎం భ‌ట్టి ప్రశంసించారు. ఆంధ్రప్రభ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలతో పాటు, అనేక మానవీయ కథనాలను అందిస్తూ ప్రజల పత్రికగా ఆంధ్రప్రభ మన్ననలు అందుకుంటోందని అన్నారు. క్రిస్టమస్ , నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి (డీపీఆర్ఓ) గౌస్ పాషా, ఆంధ్రప్రభ సర్కులేషన్ ఏజీఎం పసునూరి శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ రాయల నవీన్, సర్కులేషన్ మేనేజర్ పాపినేని చంద్రశేఖర్, ఖ‌మ్మం బ్యూరో మైస పాపారావు, సర్కులేషన్ ఇంచార్జ్ జగదీష్, ఖమ్మం సిటీ రిపోర్టర్లు ఎన్. శ్యామ్, కట్టెకోల మల్లికార్జున్, మతిన్, జనార్ధన్, దేవేందర్, నాగేశ్వరరావు , ఫోటోగ్రాఫర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement