Friday, November 22, 2024

TS : ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. గోల్డ్ రుణదారులకు బ్యాంకు ఉన్నతాధికారుల హామీ..

మంగపేట, మే 27 (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంక్ శాఖలో బంగారం గోల్ మాల్, రూ,1.44 కోట్ల విలువైన రెండు కిలోల తాకట్టు బంగారం మాయం అంటూ ఈనెల 26న ఆంధ్రప్రభ వెబ్ న్యూస్ తో పాటు ఇవ్వాల (సోమవారం) ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన కథనాలకు కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. కెనరా బ్యాంకులో బంగారం గోల్ మాల్, సుమారు రూ.1. 44 కోట్ల విలువ చేసే దాదాపు 2 కిలోల 117 గ్రాముల మేర బంగారంను సదరు బ్యాంక్ అప్రైజర్ కాజేసి పరారు అంటూ ఆంధ్రప్రభ వెబ్ న్యూస్ లో ఆదివారం కథనం రావడంతో సమాచారం తెలుసుకున్న కెనరా బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారు ఆందోళన చెందారు.

ఆదివారం బ్యాంకుకు సెలవు దినం కావడంతో గోల్డ్ లోన్ తీసుకున్న ఖాతాదారులు సోమవారం పెద్ద ఎత్తున రాజుపేటలోని కెనరా బ్యాంకు వద్దకు చేరుకున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కెనరా బ్యాంకు రీజనల్ డీజీయం శ్రీనివాసరావు, ఏజీయం మాధవిలు రాజుపేట కెనరా బ్యాంకుకు చేరుకుని గోల్డ్ లోన్ తీసుకున్న ఖాతాదారులతో మాట్లాడుతూ… రాజుపేట కెనరా బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారు ఆందోళన చెందవద్దని, దీనిపై పూర్తి విచారణ జరుపుతామని, బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి బంగారం కావాలంటే బంగారం, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా రాజుపేట కెనరా బ్యాంకు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగపేట ఎస్సై గోదరి రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement