మధిర (ప్రభ న్యూస్) గుట్కా నిల్వలపై మధిర పోలీసులు ఉక్కు పాదం మోపారు. శుక్రవారం మధిర టౌన్ ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో పట్టణంలోని వర్తక సంఘం అధ్యక్షులు వేముల తిరుపతిరావు గోడౌన్ పై దాడులు నిర్వహించి గోడౌన్ లో నిల్వ ఉన్న 2.50 లక్షల విలువచేసే గుట్కాలను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈనెల 1వ తేదీన ఆంధ్రప్రభ లో గుట్కా దందా పై చర్యలేవి? నిషేధం ఉన్నా యదేచ్ఛగా గుట్కా అమ్మకాలు అనే కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం గత నెల మే 25 నుండి రాష్ట్రంలో గుట్కాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గుట్కా నిషేధంపై ఈనెల 13వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండటంతో యువత ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే గుట్కా మసాలాపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకంజు వేశారు.
సుప్రీంకోర్టు ఆంక్షలు ముగిసిన మరుక్షణమే మధిర పోలీసులు రంగంలోకి దిగి గుట్కాలు అమ్ముతున్న డాన్ లపై చర్యలు తీసుకున్నారు. వ్యాపార వర్గాలకు ఆదర్శంగా ఉండాల్సిన వర్తక సంఘం అధ్యక్షులు వేముల తిరుపతిరావు ఇటువంటి అక్రమ వ్యాపారాలు చేస్తూ పట్టు పట్టడం పట్టణంలో చర్చనీయాంశమైంది మారింది. గతంలో కూడా ఈ వ్యక్తిపై వైరాలో గుట్కాలు రవాణా చేస్తూ పట్టుబడ్డారు. మరొకసారి గుట్కాలు అమ్ముతూ ఒక సారి మరోసారి బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు.