Thursday, January 9, 2025

NLG | ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన కీసర సంతోష్ రెడ్డి

మోతె, జనవరి 8(ఆంధ్రప్రభ) : సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో 2025 సంవత్సర ఆంధ్రప్రభ దినపత్రిక క్యాలెండర్ ను కాంగ్రెస్ పార్టీ మోతె మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ… సాంకేతికతను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు వార్తలు పాఠకులకు అందిస్తూ వారి మదిలో ఆంధ్రప్రభ చూరగొన్నదని అన్నారు. విశ్లేషణమైన కథనాలు, మానవీయ కోణంలో రాసే వార్తలతో ప్రజల మన్ననలు పొందుతుందని.. ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురించే వార్తలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మోతె గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి, యూత్ మండల అధ్యక్షులు వెలుగు వీరన్న, మాజీ ఎంపీటీసీ పగడాల విద్యావతి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొక్క వీరారెడ్డి, సురకాంటి హన్మరెడ్డి, బొడ్డు నరసయ్య, ఇండ్ల పరశురాములు, బొక్క లింగారెడ్డి, ఫరీద్, అనంతుల శ్రీను, నకరికంటి మల్లయ్య, ముస్కు చందర్ రెడ్డి, అయితేబోయిన వెంకన్న, దోసపాటి ఉపేందర్, దోసపాటి ఏసు, ఇటుకల సతీష్, మంగయ్య, తుర్క వీరస్వామి, పిడమర్తి సాయి, చల్ల ఎల్లయ్య, వెంకన్న, రాములు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement