Monday, January 27, 2025

Andhra Prabha Affect …కాళేశ్వరం ఆలయ ఈవో పై వేటు

ఆంధ్రప్రభ ప్రతినిధి భూపాలపల్లి / మహాదేవపూర్ : దక్షిణ అరణ్యశైవక్షేత్రముగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానం లో గత సోమవారం గర్భగుడి తలుపులు మూసేసి మరి ప్రైవేట్ షూటింగ్ నిర్వహించడం పై ఆంధ్రప్రభ ఎక్స్ క్లూజివ్ కథనాలు ప్రచురించడంతో రాష్ట్రవ్యాప్తంగా కాలేశ్వరం హాట్ టాపిక్ గా మారి దుమారం లేపింది.

భక్తులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై స్పందించిన రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యం గా వహించిన ఆలయ ఈవో మారుతి పై వేటు వేస్తు ఆలయ ఇంచార్జి బాధ్యతల నుండి తొలగిస్తూ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

కాగా రేగొండ కొడవటంచ లో ఈవో గా విధులు నిర్వహిస్తున్న ఈవో మహేష్ కు కాలేశ్వరం దేవస్థానం ఈవోగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. గుడిలో అపచారానికి బాద్యుడైన ఈవో పై దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం తో భక్తులు, ప్రజాసంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement