ఫార్మసి వ్యవస్థను నాశనం చేస్తున్న దళారి అసోసియేషన్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడా నేతలను అంటగాగిన కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ లు
వంత పాడిన డ్రగ్స్ అధికారులు
మందుల చాటున దోపిడీకి తెగబడిన వ్యాపారస్తులు
ఆర్థిక నేరాలలో ఆరితేరిన దళారులు
ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజల ప్రాణాలు హరి
తెలంగాణ ఫార్మసిస్టు అనుబంధ సంఘాల జేఏసీ
హైదరాబాద్ : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టకపోతే అమాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలంగాణ ఫార్మసిస్ట్ అనుబంధ సంఘాల జేఏసీ నాయకులు వాకిట అశోక్ కుమార్, కన్నెబోయిన శ్రీనివాస్, బాలరాజ్, సత్యనారాయణ గౌడ్, డాక్టర్ శివకుమార్ తేజావత్ సీతారాంబాబు, కురుమ శంకర్, ప్రొఫెసర్ గంప విజయకుమార్, అలీమ్ ఆదర్శ్, లక్ష్మీనారాయణలు ఆవేదన వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా మెడికల్ షాపుల వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వారు బహిరంగ ఆర్థిక నేరాలకు పాల్పడుతూ.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నప్పటికీ ప్రభుత్వం కానీ, సంబంధిత అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో పరిస్థితి చేజారిపోయిందన్నారు. ఫలితంగా మొత్తం ఫార్మాసి వ్యవస్థ బ్రష్టు పట్టిందన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆ ప్రభుత్వంలో బడా బాబులను అంటగాగిన కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అండ్ దళారులు అంట కాగి దోపిడీకి తెగబడడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ , ఫార్మసీ యాక్ట్ అమలు అమలు చేసే బాధ్యతను ప్రభుత్వము డ్రగ్స్ అధికారులు పూర్తిగా విస్మరించడంతో ఎక్కడ చూసినా మెడికల్ షాపులలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా స్థిరాయిడ్స్ మత్తు మందులు యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారన్నారు.
వాస్తవానికి ఫార్మసిస్ట్ అందుబాటులో ఉండి మందులు డిస్పెన్స్ చేయాలి, కానీ ఇక్కడ 90శాతం మెడికల్ షాపుల్లో ఎందుకు విరుద్ధంగా కొంతమంది ఫార్మసిస్టుల సర్టిఫికెట్లు ఆద్దెలకు తీసుకొని వ్యాపారస్తులే దుకాణాలు నడిపిస్తున్నారు. ఈ వ్యవహారంపై గతంలో ఫార్మసి కౌన్సిల్ కు, డ్రగ్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మెడికల్ మాఫియా మరింత రెచ్చిపోతుందన్నారు. ఒక ప్రక్క ఫార్మసిస్ట్ పోస్టులు ఖాళీగా ఉండడం మరో పక్క మందుల షాపులలో ఫార్మసిస్టులు లేకుండానే మందులు షాపుల నిర్వహణ కోసం అధికారులు లైసెన్సులు జారీ చేయడం తనిఖీ లు అసలు చేపట్టకపోవడం కేసులు కూడా నమోదు చేయకపోవడం పలు కారణాలను చూస్తే డ్రగ్స్ అధికారులే మెడికల్ మాఫియాని పెంచి పోషిస్తూ పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలరు తెరలేపారని తెలుస్తోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన హైడ్రా ప్రాజెక్ట్ ప్రజల్లో మంచిపేరు తీసుకొచ్చిందన్నారు. కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను రక్షించడంతో పాటు చెరువులు, కుంటలు, కాలువలు, నాళాలు అన్నీ అన్యాక్రాంతం కాకుండా కాపాడే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో మెడికల్ రంగంపై కూడా ముఖ్యమంత్రి స్పందించి హైడ్రా తరహాలో ఒక ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టి ఏళ్ల తరబడి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న మెడికల్ మాఫియాను బుడం నుంచి తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ మేరకు సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిని ప్రత్యేక హోదాలో నియమించాలని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రికి సమర్పించిన బహిరంగ లేఖలో ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హెల్త్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్పీలకు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలంగాణ ఫార్మసిస్టు అనుబంధ సంఘాల జేఏసీ నాయకులు తెలియజేశారు.