Tuesday, July 2, 2024

TG | వృద్ధుడి పైశాచికం.. చిన్నారిపై లైంగిక దాడికియత్నం

సుల్తానాబాద్ (ప్రభ న్యూస్): ఎనిమిదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా శుక్ర‌వారం వెలుగులోకి వ‌చ్చింది. తాత వరుస అయిన వ్యక్తి బాలిక‌పై లైంగిక దాడికి యత్నించిన విషయం తల్లిదండ్రులకు తెలియ‌డంతో సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు నిందితుడిపై ఫోక్సో చ‌ట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

కాగా, ఈ నెల 13వ తేదీన‌ రాత్రి సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులో ఆరేళ్ల చిన్నారిపై
లైంగిక‌దాడి, హ‌త్య జ‌రిగిన విష‌యం ప్ర‌జ‌లు ఇంకా మ‌రిచిపోలేదు. అంత‌లోనే సుల్తానాబాద్ మండ‌లంలోనే మరో ఘ‌ట‌న జరగడం చర్చనీయాంశంగా మారింది. చిన్నారుల‌పై పైశాచిక‌త్వం ప్ర‌ద‌ర్శించే వారిని వ‌ద‌లొద్ద‌ని, క‌ఠినంగా శిక్షించాల‌ని జ‌నం కోరుతున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని ప్రజాసంఘాలతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement