Monday, July 1, 2024

TS: సిరిసిల్ల పోలీసుల వినూత్న ప్ర‌యోగం..

ఎస్పీ చొరవతో తగ్గిన ప్రమాదాలు
రోడ్డు ప్ర‌మాదాల నియంత్ర‌ణ‌కు ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ చ‌ర్య‌లు
రోడ్ల‌పై పలుచోట్ల త్రీడి యానిమేటెడ్ ఫొటోలు
ఆరునెల‌ల్లో గణ‌నీయంగా త‌గ్గిన ప్ర‌మాదాలు
ఈ ఆలోచనా విధానాన్ని ప్రశంసిస్తున్న వాహనదారులు
సిరిసిల్ల, ప్రభన్యూస్ : జిల్లాలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌తో పాటు ప్ర‌మాదాల నివార‌ణ‌కు ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ చేప‌డుతున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలను ఇస్తున్నాయి. వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టి త‌ద్వారా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు సిరిసిల్ల జిల్లాలో రెండుచోట్ల ఏర్పాటు చేసిన త్రీడీ యానిమేటెడ్ ఫొటోలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచాయి. ప్రధాన రహదారుల్లో ప్రమాదాల నివారణ, వాహనాల వేగం నియంత్రించేందుకు త్రీడీ యానిమేటెడ్ పెట్రో కార్, బ్లూ కోల్ట్ అధికారి ఫొటోను సిరిసిల్ల పట్టణంలోని రగుడుచౌరస్తా, బోయినిపల్లి మండలం కొదురుపాక చౌరస్తాలో గత డిసెంబర్​లో ఏర్పాటు చేశారు.

రహదారిపై వెళుతున్న‌ ప్రయాణికులు దూరం నుంచి ఈ యానిమేటెడ్ ఫొటోలను చూస్తే అక్కడ నిజంగా పోలీస్ వాహనం పక్కన కానిస్టేబుల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీంతో వాహనదారుల త‌మ‌ వేగానికి కళ్లెం వేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్​కు ముందు ఈ రెండు ప్రధాన చౌరస్తాల్లో 36 మేజర్ ప్రమాదాలు జరిగాయి. ఆరు నెలల్లో ఒక్క మేజర్ ప్రమాదం కూడా జరగలేదు. పోలీస్ బాస్ ప్రయోగంతో గణనీయంగా ప్ర‌మాదాలు త‌గ్గాయి. ఎస్పీ తీసుకుంటున్న‌ చ‌ర్య‌లపై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement