తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన ఇంతియాజ్ ఇషాక్ ఇవ్వాల ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఉన్నారు. కాగా, స్వరాష్ట్ర సాధనలో తన వంతు కృషి చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్‌కు కార్పొరేషన్ పదవి వరించింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మైనార్టీ, టీఆర్‌ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇసాక్ రాజకీయ నేపథ్యం..
1991లో మహబూబ్‌నగర్ ఎన్‌ఎస్‌యూఐ పట్టణ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. 1994-96 వరకు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా జనరల్ కార్యదర్శిగా, 1996 నుంచి 2008 వరకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2008లో కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
2011లో టీఆర్‌ఎస్‌లోకి..
2011లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరారు. ఆ తర్వాత మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో కార్యదర్శిగా, ముస్లిం సంఘం ఫౌండర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీకి, ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించిన టీఆర్‌ఎస్ పార్టీ రా ష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పజెప్పింది. 2016, 2020లో జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జిగా, అసెంబ్లీ ఎన్నికల్లో, వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో, హుజురాబాద్, నాగార్జునసాగర్ జనరల్ ఎలక్షన్, మహబూబ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల్లో అప్పగించిన పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అభ్యర్థుల గెలుపుకోసం ఆయన కృషి చేశారు.