Wednesday, November 13, 2024

Amrith Scame – రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి కంపెనీ పై చర్యలు తీసుకోండి – కేంద్రమంత్రి కట్టర్ కు కేటీఆర్ వినతి

న్యూ ఢిల్లీ – అమృత్ పథకంలో జరిగిన అక్రమాలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు .. కొత్త ఢిల్లీ లోని కేంద్ర మంత్రి కార్యాలయం లో నేటి రాత్రి భేటీ అయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా టెండర్లు కట్టబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే పథకంలో అక్రమాలు జరిగాయని.. కేటీఆర్ పలుమార్లు ఆరోపించారు. ఆధారాలు సైతం ఉన్నాయని మీడియా ఎదుట చెప్పారు. మీడియా సమావేశంలో చూపించిన ఆధారాలతో పాటు తన దగ్గర మరిన్ని ఆధారాలు కేంద్ర మంత్రికి ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే అమృత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.. వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement