చిరుత అడుగులు గుర్తించిన అటవీ అధికారులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల సూచన
బెల్లంపల్లి, డిసెంబర్ 3 (ఆంధ్రప్రభ) : బెల్లంపల్లి అడవిలో చిరుత సంచారం కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల పరిధిలోని చర్లపల్లి గ్రామ శివారులో పులి కనిపించిందని సమాచారం తెలియడంతో, బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో పరిశీలన చేపట్టడంతో చిరుత పులి అడుగులని గుర్తించడం జరిగింది.
వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి అటు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. పంట పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని, అటవీ ప్రాంతంలో ఎలాంటి తీగలు, కుచ్చులు పెట్టవద్దని సూచించారు. ఆయన వెంట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గోపికృష్ణ, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -